logo

త్యాగనిరతి.. అమరజ్యోతి

దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు.

Updated : 23 Jun 2023 03:54 IST

సాగర తీరంలో కాంతులీనుతున్న అమరవీరుల స్మారక చిహ్నం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌: దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. సుమారు 6 వేల మంది కళాకారులు నెక్లెస్‌ రోడ్డులోని 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నుంచి స్తూపం వరకు ర్యాలీగా చేరుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సాంస్కృతిక కళామండలి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

అమరులకు జోహార్లర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

* కేసీఆర్‌ సాయంత్రం 6.30 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు.

* సాయంత్రం 6.38 గంటలకు అమరులకు నివాళులర్పించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

* సాయంత్రం 6.41 గంటలకు అమర వీరుల స్మారక కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.

* రాత్రి 7 గంటలకు అమరజ్యోతిని వెలిగించారు. అనంతరం విద్యుత్తు దీపాలు ఆర్పేసి అందరూ చేతుల్లో జ్యోతులు వెలిగించిన దీపాలు పట్టుకున్నారు.

* చినుకులు పడుతున్నా అందరూ ఆసాంతం కార్యక్రమాన్ని తిలకించి వెళ్లారు.

* వేడుకలను, అమరజ్యోతి చిహ్నాన్ని, డ్రోన్ల ప్రదర్శనను అందరూ తమతమ చరవాణుల్లో బంధించారు.

చూడముచ్చటగా.. హరీశ్‌రావు, కేటీఆర్‌

బ్యాటరీ దీపాలతో ఘన నివాళులు

సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ దీపికారెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని