logo

పోటీ ఎక్కడైనా విజయం ఆమెదే

నగరానికి చెందిన సుమిత్రాదేవి.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఘనత చాటారు. 1957లో జూబ్లీహ్లిల్స్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Published : 26 Oct 2023 04:16 IST

నగరానికి చెందిన సుమిత్రాదేవి.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఘనత చాటారు. 1957లో జూబ్లీహ్లిల్స్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1962లో హైదరాబాద్‌ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1967, 1972 సంవత్సరాల్లో మేడ్చల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1978లో ఇబ్రహీంపట్నంలో విజయకేతనం ఎగురవేశారు. 1980లో ఆమె అకాల మరణం పొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎస్సీలకు రిజర్వు చేసిన ఆయా స్థానాల నుంచి ఆమెను కాంగ్రెస్‌ రంగంలోకి దింపేది. ప్రజలు కూడా ఆదరించి ఆమె ఖాతాలో వరుస విజయాలను చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని