logo

ఆసక్తికరం.. తీర్పు విభిన్నం

కొడంగల్‌ నియోజకవర్గం.. ఈ పేరు చెబితే అటు చారిత్రకంగా, ఇటు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా పేర్కొంటారు.

Published : 28 Oct 2023 02:27 IST

అధికార పార్టీ ఒకటైతే ఇక్కడ మరొకటి  
కొడంగల్‌ రాజకీయ ముఖచిత్రం
న్యూస్‌టుడే, కొడంగల్‌

కొడంగల్‌ నియోజకవర్గం.. ఈ పేరు చెబితే అటు చారిత్రకంగా, ఇటు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా పేర్కొంటారు. ఈ నియోజకవర్గం మొదట కర్ణాటక ప్రాంతంలో ఉండగా, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. తెలంగాణ ఏర్పడటంతోపాటు, వికారాబాద్‌ జిల్లా రావడంతో మహబూబ్‌నగర్‌నుంచి వికారాబాద్‌లో కలిసింది.  

స్థానికులకే పెద్దపేట

ఆదినుంచి ఇక్కడి ఓటర్లు స్థానికులకే పెద్దపీˆట వేస్తూ వస్తున్నారు. ఎక్కువ కాలం గడి (కోట గుర్నాథ్‌రెడ్డి) (కోటలాంటి ఇంట్లో నివాసం) గుడి (నందారం వెంకటయ్య కుటుంబం) (వేంకటేశ్వర స్వామి టెంపుల్‌ స్వీయ నిర్మాణం) మధ్యనే పోరు సాగింది. పార్టీల కంటే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ విజయాన్ని కట్టబెడుతూ వస్తున్నారు. చాలాసార్లు అధికారంలో ఒక పార్టీ ఉంటే ఇక్కడ మరో పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.  

  • నియోజకవర్గం ఏర్పడినప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అందులో ఒక స్థానం జనరల్‌గా, మరోటి ఎసీˆ్స స్థానంగా ఉంది. 1952లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనంతరెడ్డి, మరో స్థానంలో వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  
  • 1962లో స్వతంత్ర అభ్యర్థి రుక్మారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి అచ్యుతారెడ్డిపై విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఈయన మంత్రి పదవిలో ఉండగానే నియోజకవర్గంలో విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి, వెలుగులు అందించారు.  

రేవంత్‌ ఎంపిక అనూహ్యం

1985లో తెదేపా అధినేత నందమూరి తారక రామారావు పర్యవేక్షణలో నందారం వెంకటయ్య తెదేపాలో చేరారు. ఎన్నికల్లో తెదేపాదే పైచేయిగా నిలిచింది.

  • 2009 ఎన్నికల్లో తెదేపా అనూహ్యంగా రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించింది. ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉండగా కొడంగల్‌ తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగినా ఈ ప్రాంత వాసులను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి గుర్నాథ్‌రెడ్డి రంగంలోకి దిగగా రేవంత్‌రెడ్డి విజయం సాధించారు.
  • 2018 ఎన్నికలలో తెరాస ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చేతిలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌నుంచి పోటీచేసి ఓటమి పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు