logo

నాంపల్లి భాజపా అభ్యర్థిగా రాహుల్‌చంద్ర

1990లో భాజపా సభ్యత్వం స్వీకరించారు. నియోజకవర్గం, నగర పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం భాజపా సెంట్రల్‌ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Published : 10 Nov 2023 04:28 IST

1. నాంపల్లి
2. జేఎల్‌ రాహుల్‌చంద్ర
3. 52 సంవత్సరాలు
4. బీకాం
5. భార్య రజనీగంధ,   కుమారులు అభిషేక్‌, రాజ్‌వీర్‌
6 .1990లో భాజపా సభ్యత్వం స్వీకరించారు. నియోజకవర్గం, నగర పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం భాజపా సెంట్రల్‌ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

న్యూస్‌టుడే, ఆసిఫ్‌నగర్‌


1. నియోజకవర్గం, 2. అభ్యర్థి, 3. వయసు, 4. విద్యార్హత, 5. కుటుంబం,  6. రాజకీయ నేపథ్యం


బహదూర్‌పుర (ఎంఐఎం) 

1. బహదూర్‌పుర
2. మహ్మద్‌ మోబీన్‌
3. 60 సంవత్సరాలు
4. డిగ్రీ
5.  భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె
6.  2002లో ఆగాపుర డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు. రమ్నాస్‌పుర డివిజను నుంచి  2009 నుంచి 2020 వరకు కార్పొరేటరుగా పనిచేశారు. 2020లో  శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు.

న్యూస్‌టుడే, దూద్‌బౌలి


చార్మినార్‌ (కాంగ్రెస్‌)

1. చార్మినార్‌
2. మహ్మద్‌ ముజీబ్‌ ఉల్లా షరీఫ్‌  
3. 55 సంవత్సరాలు  
4. ఎల్‌ఎల్‌బీ
5.  భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె.  
6.  చార్మినార్‌లో ఐదేళ్ల నుంచి కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర చార్మినార్‌లోకి ప్రవేశించగానే మూసాబౌలి నుంచి చార్మినార్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు.

న్యూస్‌టుడే, చార్మినార్‌


పటాన్‌చెరు (కాంగ్రెస్‌)  

1. పటాన్‌చెరు
2. కాటా శ్రీనివాస్‌గౌడ్‌
3. 46
4. డిగ్రీ
5. భార్య సుధారాణి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. కుమార్తె, కుమారుడు ఉన్నారు.
6. 2009లో ఉమ్మడి మెదక్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేశారు. జాతీయ స్థాయి పరిశ్రమల్లో కార్మిక సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 2013లో అమీన్‌పూర్‌ సర్పంచిగా పని చేశారు. 2018లో భారాస అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డిపై పోటీ   చేసి ఓడిపోయారు.

న్యూస్‌టుడే, పటాన్‌చెరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని