logo

Talasani: నా రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షే: తలసాని

తన రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షేనని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ను మరిచిపోనని సనత్‌నగర్‌ భారాస అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Updated : 19 Nov 2023 09:47 IST

వివిధ మతాల ప్రముఖులను సన్మానించిన మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: తన రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షేనని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ను మరిచిపోనని సనత్‌నగర్‌ భారాస అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(Talasani Srinivas Yadav) అన్నారు. ఎస్సార్‌నగర్‌ కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో సనత్‌ నగర్‌లోని మోడల్‌ కాలనీలో కార్తిక వనమహోత్సవం నిర్వహించారు. హాజరైన తలసాని మాట్లాడుతూ తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎన్టీఆర్‌ అని అన్నారు. అమీర్‌పేటలో ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. 

 తెదేపా అధినేత చంద్రబాబును జైలు పంపించడం బాధాకరమన్నారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా.. ఓ వ్యక్తిపై కేసులు పెట్టి హింసించాలనే దుర్మార్గపు ఆలోచనను ఎవరూ హర్షించరని తెలిపారు.  సంఘటన జరిగిన నాడే తాను ధైర్యంగా ఖండించానని తెలిపారు.  నిర్వాహకులు కొత్తపల్లి మధుసూదన్‌రావు, రాజారావు, నరేందర్‌ అనిల్‌, సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్‌ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, మాజీ కార్పొరేటర్‌ శేషుకుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని