logo

యువశ్రామిక శక్తితో భారత మార్కెట్‌లో సరికొత్త అవకాశాలు

భారతదేశంలో ఉన్న అపారమైన యువశ్రామిక శక్తి సరికొత్త వ్యాపార మార్గాలకు తలుపులు తెరిచిందని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) డిప్యూటీ డైరెక్టర్‌ సతోషి ససాకి అన్నారు.

Published : 30 Mar 2024 02:20 IST

మాట్లాడుతున్న సతోషి ససాకి

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: భారతదేశంలో ఉన్న అపారమైన యువశ్రామిక శక్తి సరికొత్త వ్యాపార మార్గాలకు తలుపులు తెరిచిందని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) డిప్యూటీ డైరెక్టర్‌ సతోషి ససాకి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఆధ్వర్యంలో 64వ వార్షిక ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ లేబర్‌ ఎకనామిక్స్‌(ఐఎస్‌ఎల్‌ఈ) సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన సతోషి ససాకి మాట్లాడుతూ.. భారత్‌లో లేబర్‌ మార్కెట్‌ అనేక మార్పులు జరిగాయని, ముఖ్యంగా ఆధునికత ముఖ్యభూమిక పోషిస్తుందన్నారు.ఆర్బీఐ ఎకనామిక్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ దెబప్రసాద్‌ రథ్‌ మాట్లాడుతూ.. సమర్థమైన వృద్ధికి అనువైన ఆర్థిక విధానం, పరిశోధన చాలా అవసరమన్నారు. ఐఎస్‌ఎల్‌ఈ అధ్యక్షులు ప్రొఫెసర్‌ దీపక్‌ నయ్యర్‌ మాట్లాడుతూ.. భారత్‌లో కార్మికుల జీవితాలను మెరుగుపర్చేందుకు ఐఎస్‌ఎల్‌ఈ ఎంతో కృషిచేస్తోందని తెలిపారు. హెచ్‌సీయూ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బీజే రావు, ఐఎస్‌ఎల్‌ఈ సదస్సు కార్యనిర్వహక కార్యదర్శులు ప్రొఫెసర్‌ అలక్‌ ఎన్‌.శర్మ, ప్రొఫెసర్‌ అలోక్‌ కుమార్‌ మిశ్రా, సదస్సు అధ్యక్షురాలు రితూదివాన్‌, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ బద్రి నారాయన్‌రథ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని