logo

సిమెంటు రోడ్డు.. సగంలో వదిలేశారే..!

తాండూరు పట్టణంలో వర్షా కాలంలో వరద రోడ్డు మీద పారితే రాకపోకలు స్తంభించి పోతాయి. సమస్య పరిష్కారానికి తాండూరు-  హైదరాబాద్‌ రోడ్డు కూడలి నుంచి మైనార్టీ గురుకుల పాఠశాల దాకా గత ఏడాది రూ.5.2 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు చేపట్టారు.

Published : 10 Apr 2024 01:17 IST

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: తాండూరు పట్టణంలో వర్షా కాలంలో వరద రోడ్డు మీద పారితే రాకపోకలు స్తంభించి పోతాయి. సమస్య పరిష్కారానికి తాండూరు-  హైదరాబాద్‌ రోడ్డు కూడలి నుంచి మైనార్టీ గురుకుల పాఠశాల దాకా గత ఏడాది రూ.5.2 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు చేపట్టారు. రెండు వైపులా 3 కిలో మీటర్ల పొడవునా సిమెంటు రోడ్డు, వరద కాల్వ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా ఒక వైపు 2.4 కిలో మీటర్లు పొడవు మాత్రమే రోడ్డు వేశారు. మరో వైపు పాత తారు రోడ్డు అలాగే ఉంది. తారు రోడ్డు ధ్వంసం అవటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనాదారులకు అవస్థలు తప్పడం లేదు. వర్షాకాలం వచ్చేలోపల సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాక పోతే పరిస్థితి మళ్లీ మొదటికి రాక తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాండూరు పట్టణం నాపరాతి వ్యాపార కేంద్రం. నిత్యం కర్ణాటక, ఏపీ, తదితర రాష్ట్రాలనుంచే కాదు, సమీప హైదరాబాద్‌ నుంచి కూడా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నాపరాళ్లు, సుద్ద తరలిస్తుంటాయి. దీంతో రహదారులు గుంతలు పడి పూర్తిగా దెబ్బతింటున్నాయి. వర్షా కాలంలో రోడ్లు బాగలేక పోవడంతోపాటు పట్టణంలోని వర్షపు నీరు బయటకు వెళ్లే వీలు లేక ఇళ్లలోకి చేరుతోంది. దీనివల్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోడ్ల మరమ్మతులు సత్వరం పూర్తిచేస్తే సమస్యలు కొంత మేరకైనా పరిష్కారమవుతాయని పలువురు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని