గర్భం రాకుండానే వచ్చినట్లు నమ్మించి...
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బూజునూరు చెందిన ఓ వివాహిత తొమ్మిది నెలలుగా గర్భం దాల్చకున్నా గర్భం వచ్చినట్లు నమ్మించగా... చివరికి అసలు విషయం బయటపడడంతో ఈ విషయం
తొమ్మిది నెలలు దాటాక వైద్య నిపుణుల సంప్రదించిన భర్త
తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యురాలు
హుజూరాబాద్ పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బూజునూరు చెందిన ఓ వివాహిత తొమ్మిది నెలలుగా గర్భం దాల్చకున్నా గర్భం వచ్చినట్లు నమ్మించగా... చివరికి అసలు విషయం బయటపడడంతో ఈ విషయం వివాదాస్పదమైంది. ఆసుపత్రి వైద్యురాలు ప్రసూతి తేదీని కూడా నిర్ధారించడం గమనార్హం. వివాహం జరిగి రెండేళ్లు కాగా పిల్లల కోసం స్థానికంగా ఓ వివాహిత ఆసుపత్రిలో చూపించుకుంది. తర్వాత వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా అక్కడి వైద్యులు ఇన్ఫెర్టిలిటీ ద్వారా అవకాశాలున్నాయని గర్భం దాల్చవచ్చని రిపోర్టు ఇచ్చారు. దీంతో వివాహిత తన భర్తను నమ్మించింది. తాను గర్భవతినని తొమ్మిది నెలల పాటు విశ్రాంతి అవసరమని తన తల్లిగారింటి వద్దనే ఉండాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు నమ్మకం పెంచింది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో హుజూరాబాద్ ప్రాంతీయాసుపత్రిలోని గైనకాలజిస్టు డాక్టర్ నందితను సంప్రదించింది. సదరు వైద్యురాలు జమ్మికుంటలోని తనకున్న ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్, ఇతర పరీక్షలు చేసి ఏకంగా డెలివరీ డేట్‌ను ఇచ్చి పంపించింది. భర్తకు అనుమానం వచ్చి మంగళవారం స్థానిక ప్రాంతీయాసుపత్రికి వచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డిని కలిశారు. ప్రసూతి తేదీని ఇచ్చిన మాట వాస్తవమేనని పేషెంట్‌ను చూడకుండా రిపోర్టుల ఆధారంగా డేట్ ఇచ్చిన డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సదరు వైద్యురాలు మాత్రం తన వద్దకు రిపోర్టులతో పాటు వేరే మహిళ(గర్భిణి)ని పంపించారని అందుకే తాను డెలివరీ డేట్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో తన తప్పేమీ లేదంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
[ 05-05-2024]
నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. -
ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
[ 05-05-2024]
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. -
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
[ 05-05-2024]
-
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
[ 05-05-2024]
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
[ 05-05-2024]
లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. -
ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి
[ 05-05-2024]
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్‌ను పరిశీలించారు. -
జగిత్యాలలో నేడు కేసీఆర్ రోడ్‌షో
[ 05-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. -
భానుడి భగభగలు!
[ 05-05-2024]
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. -
ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా
[ 05-05-2024]
‘కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. -
దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
[ 05-05-2024]
కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. -
కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్
[ 05-05-2024]
ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్‌కుమార్‌కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. -
రిజర్వేషన్లను రక్షించుకుందాం
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. -
రూ.10.88 లక్షల నగదు పట్టివేత
[ 05-05-2024]
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి పరకాల అడ్డదారి చెక్‌పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. -
వీణవంకకు చేరుకున్న కేసీఆర్
[ 05-05-2024]
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
[ 05-05-2024]
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. -
భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా
[ 05-05-2024]
జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.