logo

మువ్వన్నెల రెపరెపలు

జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లా కలెక్టరేట్‌ సహ పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సంస్థల్లో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా

Published : 27 Jan 2022 04:49 IST

నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవం

కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌, అధికారులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లా కలెక్టరేట్‌ సహ పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సంస్థల్లో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్‌ వందనం స్వీకరించారు. అంతకు ముందు గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ, అదనపు పాలనాధికారులు జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌, గరిమ అగ్రవాల్‌ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

* తన క్యాంపు కార్యాలయంతో పాటు కరీంనగర్‌ క్లబ్‌లో జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ తన క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు.

కరీంనగర్‌ కోర్టు ఆవరణలో

కరీంనగర్‌ న్యాయవార్తలు:  జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం పతాకావిష్కరణ జరపగా న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గసభ్యులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పివి రాజ్‌కుమార్‌, గౌరు రాజిరెడ్డి, అదనపు ప్రభుత్వ న్యాయవాది పూరెల్ల రాములు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది కొద్ది సంఖ్యలో పాల్గొన్నారు.

పరేడ్‌మైదానంలో జరిగిన వేడుకల్లో సీపీ సత్యనారాయణ, పోలీసు అధికారులు

జిల్లా సహకార బ్యాంకులో..

కరీంనగర్‌ పట్టణం: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 73వ గణతంత్ర వేడుకలు జరిగాయి. నాఫ్స్కాబ్‌, టిస్కాబ్‌, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై బ్యాంకు సిబ్బంది, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న మూడేళ్ల నుంచి అయిదేండ్లలో ప్రస్తుతమున్న 67 శాఖల నుంచి వంద శాఖలకు పెంచడానికి కార్యాచరణ చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు సీఈవో ఎన్‌.సత్యనారాయణ రావు, పింగిలి రమేష్‌, ఉపాధ్యక్షుడు స్వామిరెడ్డి, పాలకవర్గ సభ్యులు బి.గోపాల్‌రావు, పి.ప్రభాకర్‌రెడ్డి, ఎండీ.రియాజుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

* కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ పరిశోధన క్షేత్రం అధికారి, శాస్త్రవేత్త మంజులత జాతీయ పతాకం ఎగుర వేశారు. కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.


జాతీయ గీతం ఆలపిస్తున్న టెస్కాబ్‌, జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, కార్యాలయ ఉద్యోగులు

కమిషనరేట్లో..

కరీంనగర్‌ నేరవార్తలు : కరీంనగర్‌ కమిషనరేట్ ఆవరణలోని పరేడ్‌ మైదానంలోని జాతీయ జెండాను పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ ఆవిష్కరించి గౌరవందనం చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు ఎస్‌.శ్రీనివాస్‌, జి.చంద్రమోహన్‌, ఏసీపీలు విజయసారథి, శ్రీనివాస్‌, మదన్‌లాల్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

పిటిసిలో...రాంనగర్‌లోని పోలీస్‌ శిక్షణ కళాశాలలో ప్రిన్సిపల్‌ వి.సునీతమోహన్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వైస్‌ ప్రిన్సిపల్‌ రవి, డీఎస్పీలు శ్రీనివాసులు, కాశయ్య, గంగాధర్‌, ఆర్‌ఐలు తిముఖ్‌, శ్రీనివాస్‌, సంపత్‌ ఉన్నారు.

* కరీంనగర్‌ కమిషనరేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో జాతీయ జెండాను ఏసీపీ నాగేందర్‌ ఆవ్కిరించారు. ఆర్‌ఐ కిరణ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని