logo

జానపదం.. మా ప్రాణపదం

రాష్ట్రాలు వేరైనా.. సంస్కృతి, సంప్రదాయాలను జానపద రూపంలో తెలియజెప్పేందుకు ఒకే వేదిక వద్దకు రావడం ఆనందంగా ఉందని పలువురు కళాకారులు పేర్కొన్నారు. తాము ప్రదర్శించే నృత్యాలు వేర్వేరుగా ఉన్నా భావం ఒక్కటేనని నృత్యకారులు తెలిపారు. కరీంనగర్‌ కళోత్సవాల్లో

Published : 02 Oct 2022 06:14 IST

వివిధ రాష్ట్రాల కళాకారుల మనోగతం
కరీంనగర్‌ సాంస్కృతికం, కరీంనగర్‌ పట్టణం

కళాకారుల నృత్యప్రదర్శన

రాష్ట్రాలు వేరైనా.. సంస్కృతి, సంప్రదాయాలను జానపద రూపంలో తెలియజెప్పేందుకు ఒకే వేదిక వద్దకు రావడం ఆనందంగా ఉందని పలువురు కళాకారులు పేర్కొన్నారు. తాము ప్రదర్శించే నృత్యాలు వేర్వేరుగా ఉన్నా భావం ఒక్కటేనని నృత్యకారులు తెలిపారు. కరీంనగర్‌ కళోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ‘న్యూస్‌టుడే’తో పలువురు కళాకారులు తమ భావాలను పంచుకున్నారు.


  మా ప్రదర్శనలు ఒకే పోలిక
- సోనాల్‌, మహారాష్ట్ర

తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన మా ప్రదర్శనలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. భాష వేరైన భావం ఒక్కటే. నవరాత్రుల సందర్భంగా నాగపూర్‌లో అంబా ఫెస్టివల్‌లో మా ప్రదర్శనలకు ప్రత్యేకత ఉంటుంది. అమరావతి స్టార్‌ సంస్థ ద్వారా అనేక ప్రాంతాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కరీంనగర్‌ కళోత్సవాలు చాలా బాగున్నాయి.


 తెలంగాణ జానపదాలు నచ్చాయి
- గీతాంజలి, అస్సాం

మేం కూడా రెండు ప్రదర్శనలు ఇస్తున్నాం. ఎన్‌.ఎస్‌.ఎస్‌.కు చెందిన 11 మంది అస్సాంలో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించాం. పలు ప్రాంతాలను సందర్శించినా కరీంనగర్‌ కార్యక్రమం చాలా బాగుంది. తెలంగాణ జానపదాలు ఆకర్షించాయి. మా సంస్కృతిని వేదికపై తెలియజేసేందుకు వచ్చాం.


యువజన ఉత్సవాల్లో ..

-జగ్జీవన్‌ రాఘవ, గుజరాత్‌

అహ్మదాబాద్‌ ప్రాంతంలోని కురేంద్రనగర్‌కు చెందిన యువజన సంఘం ద్వారా అక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. మా సంస్కృతిని తెలియజేసే నృత్యాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. మూడు ప్రదర్శనలు ఎంపిక చేశారు. 15 మంది  సభ్యులలో యువతియువకులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వారుకూడా ఆయా ప్రాంతాల సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం వల్ల వాటిని అవగాహన చేసుకుంటున్నాం.


ఒకే వేదికపై కలుస్తున్నాం    

-రెగీనా, కేరళ
అన్ని రాష్ట్రాల కళాకారులను కలుసుకునే అవకాశం కరీంనగర్‌ వేదిక కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాం. కొలికొడ్‌ జిల్లాలోని జానపద సాంస్కృతిక ఫోరం ద్వారా కల్చరల్‌ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అక్కడ ప్రదర్శించిన వాటికంటే భిన్నంగా మా రాష్ట్ర ప్రత్యేక ప్రదర్శనలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. 12 మంది ప్రదర్శనలో పాల్గొంటున్నాం.


మా సంసృతిని తెలియజేస్తాం
-అజయ్‌కుమార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌

మా రాష్ట్ర సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ, విదేశాలకు వెళ్లాం. ఖాట్మండ్‌లో మా ప్రదర్శనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ కూడా రెండు ప్రదర్శనలు ఇస్తున్నాం. సమీప రాష్ట్రాల వారిని కూడా కలుసుకునే అవకాశం కలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని