logo

తొలిమెట్టు నోడల్‌ అధికారులకు భత్యం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్‌ అధికారిని నియమించారు.

Published : 28 Mar 2024 05:25 IST

ఉమ్మడి జిల్లాకు రూ.3.66 లక్షలు మంజూరు

కొత్తపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోధనా పద్ధతులను పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి (పాత చిత్రం)

 న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్‌ అధికారిని నియమించారు. తొలిమెట్టు అమలు తీరు, విద్యావిషయక ప్రగతి నివేదికలు వారు క్రమం తప్పకుండా పాఠశాలల్లో పర్యవేక్షిస్తుండటంతో ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తోంది. చదువుల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనను పరిశీలించడం వంటివి ఈ అధికారులు చూస్తున్నారు. వీరికి నెలకు రూ.600 భత్యాన్ని అందివ్వనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొలిమెట్టు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నోడల్‌ అధికారులకు తాజాగా ప్రభుత్వం భత్యాలు విడుదల చేసింది. ఒక్కో అధికారికి పది నెలల భత్యం రూ.6 వేలు చెల్లించేలా నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 61 నోడల్‌ అధికారులకు రూ.3.66 లక్షలు మంజూరయ్యాయి.

 మెరుగవుతున్న బాలల సామర్థ్యాలు

  •  ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో బాలలు ఈ కార్యక్రమంతో విద్యా సామర్థ్యాలను సాధించారు. ముందుగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ విద్యాశాఖ అందించింది.
  • 1వ తరగతి బాలలు నిమిషానికి 20 పదాలు, 2వ తరగతి వారు 25, 3వ తరగతి వారు 30, 4వ తరగతి వారు 40, అయిదో తరగతి వారు 50 పదాలను దారాళంగా చదవానేది లక్ష్యం. వీటికితోడు తరగతులను బట్టి సరళ పదాలు, గుణింతాలు, ఒత్తులు, పదాలు, నాలుగు నుంచి అయిదు వాక్యాల గురించిన పదాలు తప్పులు లేకుండా రాయాలి.
  •  చదువులో బాలల కనీస సామర్థ్యాలను పెంచేందుకు అభ్యసన పుస్తకాలను విడతల వారీగా విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పీరియడ్లలో 45 నిమిషాలు బోధించి మిగిలిన సమయాన్ని అభ్యసన పుస్తకంలోని వర్క్‌ షీట్లకు కేటాయించాలి. అయిదు రోజులు బోధించిన అనంతరం ఆరో రోజు మూల్యాంకనం పేజీతో బాలలకు పరీక్ష నిర్వహిస్తారు. తద్వారా చదువుల్లో విద్యార్థుల స్థాయిలను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని