logo

లోక్‌సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Updated : 29 Mar 2024 06:07 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, పెద్దపల్లి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి జగిత్యాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష లాంటిదని భాజపా మళ్లీ గెలిస్తే దేశానికి ముప్పు తప్పదన్నారు. దశాబ్దకాలంగా కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో భారాసను ప్రజలు ఓడించినట్లే కేంద్రంలో భాజపాను ఓడించడం ఖాయమన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో భారాస ఒక్కస్థానం గెలువదని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి గెలుపుఖాయమన్నారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనలో దేశానికి పేద ప్రజలకు ఏం చేసిందో ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే తన ఆశయమని వంశీ అన్నారు. పురపాలక ఛైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, మాజీ ఛైర్మన్లు టి.విజయలక్ష్మి, గిరినాగభూషణం, పీసీసీ సభ్యులు బండ శంకర్‌, టి.శోభారాణి, పట్టణాధ్యక్షుడు కొత్త మోహన్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని