logo

కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు

ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 29 Mar 2024 05:18 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం కరీంనగర్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన భవన సముదాయాల ఆస్తి పన్ను రూ.3,78,67,697 ఉండగా ఓటీఎస్‌ ద్వారా రూ.1,89,80,329 వడ్డీ మాఫీ జరిగిందని, మిగతా రూ.1,88,87,368 మొత్తాన్ని చెక్కు రూపంలో నగరపాలికకు అందజేశారు. తెలంగాణ సీడీఎంఏ పోర్టల్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఆస్తిపన్ను చెల్లించుకోవాలని కోరారు. డిప్యూటీ కమిషనర్‌ స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టారు. గురువారం ఒక్క రోజే రూ.2,34,04,894 వసూలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని