logo

శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్‌ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు.

Published : 20 Apr 2024 04:50 IST

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్‌ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న ఈ తరగతులను, అందిస్తున్న స్టడీ మెటీరియల్‌ను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థినులు ఉపాధ్యాయినుల ద్వారా ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. కష్టపడి చదువుతూ ఉన్నత ర్యాంకులు సాధించి రాబోయే తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. పిల్లలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, జిల్లా జెండర్‌, ఈక్విటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డెబోరా కృపారాణి,  కేజీబీవీ ప్రత్యేకాధికారి పుష్పారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని