logo

170 బస్తాల బియ్యం పట్టివేత

ఆదోని పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రభుత్వ రాయితీ బియ్యం రవాణాపై ఆదోని రెండో పట్టణ పోలీసులు దాడులు చేపట్టారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.

Published : 14 Aug 2022 01:08 IST

ఐదుగురు అరెస్టు.. మరొకరు పరారీ

నిందితులు, బియ్యం బస్తాలు, వాహనాలను చూపిస్తున్న డీఎస్పీ వినోద్‌కుమార్‌,

సీఐ గుణశేఖర్‌బాబు తదితరులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రభుత్వ రాయితీ బియ్యం రవాణాపై ఆదోని రెండో పట్టణ పోలీసులు దాడులు చేపట్టారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని సాయిబాబా దేవాలయం వద్ద రెండు ఆటోల్లో రాయితీ బియ్యం బస్తాలను తరలిస్తుండగా రెండో పట్టణ సీఐ గుణశేఖర్‌బాబు, ఎస్సై హనుమంతరెడ్డి సిబ్బందితో కలిసి దాడులు చేసి పట్టుకున్నారు. 50 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు బియ్యం తరలిస్తున్న ఎరుకలి మహేశ్‌, హనుమంతప్ప, ఇందప్పలను అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ బియ్యం బస్తాలను శిరుగుప్ప చెక్‌పోస్టు వద్ద ఉన్న రెండు లారీలకు తరలిస్తున్నారని తేలడంతో సంఘటన స్థలానికి చేరుకొని రాయితీ బియ్యం లోడు చేసుకుంటున్న రెండు లారీలను సైతం సీజ్‌ చేసి, 120 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవరు ఖాసీం, హమాలీ గణేశ్‌లను అరెస్టు చేశారు. ఆదోని పట్టణం హనుమన్‌నగర్‌కు చెందిన గొల్ల రాజశేఖర్‌ అనే వ్యక్తి పట్టణంలో తక్కువ ధరలకు బియ్యం కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని రారావి ప్రాంతానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నాడని విచారణలో తేలిందన్నారు. రాజశేఖర్‌ పరారీలో ఉన్నాడన్నారు. బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో గుర్తించి కేసు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో మొత్తం 68 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు, నాలుగు వాహనాలను సీజ్‌ చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు