logo

వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు

వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

Published : 28 Mar 2024 03:20 IST

యువతితో మాట్లాడుతున్న గౌరు చరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు పట్టణం 20, 21 వార్డుల్లో బుధవారం పర్యటించారు. ఆమె మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు తగిన బుధ్ధి చెప్పాలన్నారు. తెదేపాను అధికారంలోకి తీసుకొద్దామని చెప్పారు. కల్లూరు 31వ వార్డు శరీన్‌నగర్‌లో యువ నేత గౌరు జనార్దన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ పథకాలను అందజేస్తారని తెలిపారు.

ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్‌: అధికారంలోకి రాక ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దఎత్తున హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటికి నెరవేర్చలేదని పాణ్యం తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. మాధవనగర్‌లోని తన స్వగృహంలో బుధవారం మాట్లాడారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. యువతను మత్తుకు బానిసలయ్యేలా చేశారని ధ్వజమెత్తారు. ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తున్నావని సీఎంను నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని