logo

భాజపా అభ్యర్థులు వీరే

భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మూడో జాబితా విడుదల చేసింది.

Published : 03 Nov 2023 05:28 IST

భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మూడో జాబితా విడుదల చేసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. కమలదళం కదనరంగంలోకి దూకుతోంది. ప్రకటించిన అభ్యర్థుల నేపథ్యం, వారి వ్యక్తి‘గతం’ గురించి తెలుసుకుందాం.

న్యూస్‌టుడే, నారాయణపేట, ఆత్మకూరు, అచ్చంపేట న్యూటౌన్‌, వనపర్తి న్యూటౌన్‌, గండీడ్‌, జడ్చర్ల గ్రామీణం


నియోజకవర్గం : జడ్చర్ల

పేరు : జె.చిత్తరంజన్‌దాస్‌

పుట్టిన తేదీ : 19.06.1951

చదువు : డిగ్రీ (బీకాం)

వృత్తి : వ్యవసాయం

కుటుంబ నేపథ్యం : తల్లిదండ్రులు నారాయణమ్మ, నరసింహదాస్‌(న్యాయవాది), భార్య నీరజ, ముగ్గురు కుమార్తెలు ప్రశాంతి, స్వాతిదాస్‌, శ్వేతాదాస్‌ ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణం ఎలికట్టలో నివాసం.
రాజకీయ ప్రవేశం : చిత్తరంజన్‌దాస్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1986లో కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1987-1999 మధ్య పీసీసీ సభ్యుడిగా, 1955-1998 మధ్య పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీచేసిన తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను చిత్తరంజన్‌దాస్‌ ఓడించి సంచలనం సృష్టించారు. 1989-1992 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి కేటినెట్‌లో కార్మిక, ఉపాధి కల్పన, టూరిజం, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2004-2019 వరకు పీసీసీ ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2018లో తెరాస(భారాస)లో చేరారు. 2023లో ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు.


నియోజకవర్గం: నారాయణపేట

పేరు : కొత్తకాపు రతంగ్‌ పాండురెడ్డి

పుట్టినతేదీ : 1965 ఆగస్టు 25

చదువు : ఇంటర్మీడియట్

వృత్తి : వ్యవసాయం

రాజకీయ ప్రవేశం : 1989 నుంచి 1993 నారాయణపేట మండలం సింగారం సర్పంచి

కుటుంబ నేపథ్యం : భార్య రత్నమాల, కుమారుడు డా.రాజేశ్‌రెడ్డి,, కూతురు డాక్టర్‌ శ్వేత

అనుభవం : 1993 నుంచి  1995 వరకు భాజపా మండల ప్రధాన కార్యదర్శిగా, 1995 నుంచి 2000 వరకు పేట మండల పరిషత్తు అధ్యక్షుడిగా, 2000 నుంచి 2003వరకు భాజపా మండలశాఖ అధ్యక్షుడిగా, అనంతరం 2006లో భాజపా జిల్లా ప్రధానకార్యదర్శిగా, 2010 నుంచి ఉమ్మడి మహబూబ్నగర్‌ జిల్లా భాజపా అధ్యక్షుడిగా, రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 2022లో సాగు, తాగునీటి కోసం పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా జైలుకు వెళ్లారు. 2014లో భాజపా, తెదేపా ఉమ్మడి పోటీ నేపథ్యంలో టిక్కెట్టు రాక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 23,238 ఓట్లు సాధించారు. 2018 ఎన్నికల్లోనూ భాజపా అభ్యర్థిగా మరోమారు పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి భాజపా అభ్యర్థిగా పోటీపడుతున్నారు.


నియోజకవర్గం: అచ్చంపేట

పేరు : దేవని సతీశ్‌ మాదిగ

విద్యాభ్యాసం :     బి.ఎ.

తల్లిదండ్రులు :    శేషమ్మ, కిష్టయ్య

భార్య :          సుగుణకళ

సంతానం :       కుమారుడు సూరజ్‌ బాబు, కుమార్తె సస్య

పుట్టిన తేది :     10.08.1969

స్వస్థలం :    చుక్కాయపల్లి,  కొల్లాపూర్‌ మండలం  

వృత్తి :         వ్యాపారం, రాజకీయం

రాజకీయ ప్రవేశం : 1996లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితిలో విద్యార్థి నేతగా, 2002 నుంచి 2009 వరకు ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి నాగర్‌కర్నూల్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి.2010 నుంచి 2017 వరకు తెదేపా, 2017లో కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర అధికారి ప్రతినిధిగా పని చేశారు.2022లో భాజపాలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


నియోజకవర్గం: వనపర్తి

పేరు : ఇట్టా అశ్వత్థామరెడ్డి

పుట్టిన తేదీ : 13.10.1965

చదువు : ఇంటర్మీడియట్‌ మధ్యలో ఆపేశారు.

కుటుంబం : భార్య అరుణ, కుమారుడు విరాజిత్‌రెడ్డి (ఆస్రేలియా), కుమార్తె భవ్యశ్రీరెడ్డి (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు)

వృత్తి : ఆర్టీసీ డ్రైవరు. 2021లో ఉద్యోగానికి రాజీనామా. ఎన్‌ఎంయూ నుంచి బయటకు వచ్చి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

రాజకీయరంగ ప్రవేశం : 2021లో భారతీయ జనతా పార్టీలో చేరారు.


నియోజకవర్గం: మక్తల్‌

పేరు : మాదిరెడ్డి జలంధర్‌ రెడ్డి

పుట్టిన తేదీ : 30.10.1964

తల్లిదండ్రులు : మాదిరెడ్డి శివారెడ్డి, పార్వతమ్మ

విద్యాభ్యాసం : బీకాం

కుటుంబం : భార్య పద్మజ, కుమారుడు రిగ్వేద్‌రెడ్డి, కూతురు నిశిక

సొంత గ్రామం : నర్వ

రాయకీయ నేపథ్యం : తండ్రి శివారెడ్డి ఆత్మకూరు మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌. జలంధర్‌రెడ్డి యువకుడిగా కాంగ్రెస్‌ పార్టీ నాయకునిగా గుర్తింపు. అమరచింత నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. అనంతరం భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


నియోజకవర్గం     : పరిగి

పేరు           : మారుతి కిరణ్‌ భూనేటి

పుట్టినతేదీ        : 02-03-1979

విద్యార్హత        : బీటెక్‌, ఎంబీఏ

కుటుంబ నేపథ్యం  : తల్లిదండ్రులు వినోదిని, సాయిలు, భార్య అర్చన, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వృత్తి           : వ్యాపారం, ప్రకృతి వ్యవసాయం  

అనుభవం        : శంషాబాద్‌ సమీపంలోని గొల్లపల్లి స్వస్థలం. 1990లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై పనిచేశారు. ప్రస్తుతం భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని