logo

రేపటి నుంచి లోక్‌సభ నామపత్రాల స్వీకరణ

లోక్‌సభ ఎన్నికల నామపత్రాలను ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ జి.రవి నాయక్‌ అన్నారు.

Published : 17 Apr 2024 05:24 IST

రిటర్నింగ్‌ అధికారి జి.రవి నాయక్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల నామపత్రాలను ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ జి.రవి నాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టర్‌ ఛాంబరులో రిటర్నింగ్‌ అధికారి నామపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ నెల 21న ఆదివారం మినహాయించి ఏడు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రిటర్నింగ్‌ అధికారి ఛాంబరులోకి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 26న నిశిత పరిశీలన చేస్తారని, 29వ తేదీ వరకు ఉపసంహరణలకు గడువు ఉందన్నారు. నామినేషన్‌ ఫారం-2ఏలో అఫిడవిట్‌ ఫారం-26లో సమర్పించాలన్నారు. ఎన్నికల ఖర్చు విషయమై కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. అభ్యర్థికి రూ.25వేలు సెక్యూరిటీ డిపాజిట్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అన్ని రకాల అనుమతులకు సువిధ యాప్‌లో దరఖాస్తు చేయాలని, దరఖాస్తు 48 గంటల ముందస్తుగా చేయాలని సూచించారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా ప్రకటనల జారీకి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్‌, ఎస్‌.మోహన్‌ రావు, డీఆర్వో కేవీవీ రవి కుమార్‌, భాజపా నుంచి అంజయ్య, రాజేంద్రరెడ్డి, సీపీఐ నుంచి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని