logo

పారిశుద్ధ్యానికి విధులకు హాజరుకాని కార్మికులు

● సంక్రాంతి సెలవులు రావడంతో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు చాలా మంది విధులకు హాజరు కావడంలేదు. పొరుగు, ఒప్పంద కార్మికులకు సంక్రాంతి రోజున మాత్రమే ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే ఆదివారం కనుమరోజు 70శాతం కార్మికులు విధులకు హాజరుకాలేదు. సోమవారం 50శాతం హాజరైనట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జి శాస్త్రి తెలిపారు.

Published : 18 Jan 2022 05:58 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పూర్ణామార్కెట్‌ సమీపంలో చెత్త వద్ద పశువులు

● సంక్రాంతి సెలవులు రావడంతో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు చాలా మంది విధులకు హాజరు కావడంలేదు. పొరుగు, ఒప్పంద కార్మికులకు సంక్రాంతి రోజున మాత్రమే ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే ఆదివారం కనుమరోజు 70శాతం కార్మికులు విధులకు హాజరుకాలేదు. సోమవారం 50శాతం హాజరైనట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జి శాస్త్రి తెలిపారు. బుధవారం నాటికి పూర్తిస్థాయిలో కార్మికులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

పండగ వేళ నగరంలో పారిశుద్ధ్యం దిగజారింది. వరుస సెలవుల కారణంగా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరుకాలేదు. మరో పక్క కమిషనర్‌, ప్రధాన వైద్యాధికారి, సహాయ వైద్యాధికారితోపాటు, ఒక జోనల్‌ కమిషనర్‌ కొవిడ్‌ బారినపడ్డారు. పకడ్బందీ పర్యవేక్షణ లేకపోవడంతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. పందులు, పశువులు వాటి చుట్టూ చేరి పరిస్థితిని మరింత దిగజార్చాయి.

‘సెలవు’

తిరిగిన 30శాతం వాహనాలు..

ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరించడానికి జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన వాహనాలు సోమవారం 30శాతం మాత్రమే తిరిగాయి. కొన్ని వాహనాల చోదకులు విధులకు హాజరు కాలేదు. మరికొన్నింటికి చోదకులు ఉన్నా.. కార్మికుల్లేకపోవడంతో వారే వీధుల్లో వాహనాలను తిప్పుతూ చెత్తను వాహనాల్లో వేయాలని ప్రజలను కోరడం కనిపించింది. డంపర్‌ బిన్నులు తీసుకెళ్లే వాహనాల జాడ లేకపోవడంతో బిన్నులు నిండి, వాటి చుట్టూ చెత్త దర్శనమిస్తోంది.


బుధవారం నాటికి మార్ఫు..

సోమవారం కార్మికులు కాస్త తక్కువగా హాజరయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ, తరలింపు జరగలేదు. బుధవారం నాటికి మొత్తం చెత్తను తరలించి, పూర్వ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటాం. విధులకు వచ్చే కార్మికులంతా కచ్చితంగా మాస్కులు, చేతి తొడుగులు ధరించాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు కార్మికులెవరికీ కొవిడ్‌ సోకినట్లు నివేదికలు అందలేదు.

- డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జి శాస్త్రి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని