logo

నకిలీ పోలీసుల కేసులో ముగ్గురి అరెస్ట్‌

రిసార్టులో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకులను పోలీసులమంటూ బెదిరించి నగదు ఎత్తుకుపోయిన ఉదంతంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి బాధ్యులైన నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశారు.

Published : 29 Jun 2022 03:42 IST

భీమునిపట్నం, న్యూస్‌టుడే: రిసార్టులో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకులను పోలీసులమంటూ బెదిరించి నగదు ఎత్తుకుపోయిన ఉదంతంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి బాధ్యులైన నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశారు. భీమిలి ఎస్‌.ఐ. పి.రాంబాబు అందించిన వివరాలిలా.. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అదపాక పరిసర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు ఈనెల 27వ తేదీ రాత్రి భీమిలి ఎస్‌.ఒ.ఎస్‌.రోడ్డులో ఉన్న ఒక ప్రయివేటు రిసార్టులో దిగారు. వీరంతా సరదాగా కాలక్షేపం చేస్తుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రిసార్టులోకి బలవంతంగా చొరబడ్డారు. తాము పోలీసులమంటూ బెదిరించి వీరి నుంచి రూ.76,900 నగదును లాక్కుపోయారు. తర్వాత బాధితులు అప్రమత్తమై వారిని వెంబడించి పుక్కళ్ల కరుణ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు దాసరి మణికంఠ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోపిడీకి పాల్పడిన కరుణతో పాటు సాలిగ్రామ సతీష్‌, చెన్నా శివప్రసాద్‌లను అరెస్ట్‌ చేసి నగదును రికవరీ చేశామని, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్ట్‌ కావాల్సి ఉందని ఎస్‌.ఐ.రాంబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని