logo

‘వైకాపాలో తప్పులు చేస్తే పదవులు’

ప్రజా ప్రతినిధులు తప్పులు చేస్తే పదవులు ఇస్తున్న సంస్కృతి వైకాపా ప్రభుత్వంలో కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

Published : 09 Aug 2022 05:46 IST

ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో వంగలపూడి అనిత

సింహాచలం, న్యూస్‌టుడే: ప్రజా ప్రతినిధులు తప్పులు చేస్తే పదవులు ఇస్తున్న సంస్కృతి వైకాపా ప్రభుత్వంలో కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించామన్నారు. గోరంట్ల మాధవ్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు వ్యవహారాలు బయటకు వచ్చినా ఎలాంటి శిక్షలు వేయకపోగా పదవులు ఇచ్చిన పరిస్థితి నెలకొందన్నారు. అందుకే ప్రజా ప్రతినిధులు భయం లేకుండా తప్పులు చేస్తున్నారన్నారు. త్వరలోనే దిల్లీ వెళ్లి హోం మంత్రిని, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, ఎంపీలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని