ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యతో తీవ్ర విషాదం
అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. విశాఖ శివారులోని బోయపాలెం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల వసతి గృహంలో విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.
విశాఖపట్నం, చోడవరం, న్యూస్‌టుడే: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. విశాఖ శివారులోని బోయపాలెం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల వసతి గృహంలో విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ కథనం ప్రకారం.. చోడవరం మండలం జన్నవరం గ్రామానికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుబాయి వెళ్లి వచ్చాడు. భార్య ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. వీరి పెద్ద కుమార్తె మధురవాడ దరి బోయపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతూ కళాశాల వసతి గృహంలోనే ఉంటోంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఆ విద్యార్థిని మార్కులు తక్కువగా వస్తాయన్న భయంతో సోమవారం రాత్రి వసతిగృహంలో ఉరేసుకుంది. కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నానని అందువల్ల పరీక్ష బాగా రాయలేదని, మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసింది. పోస్టుమార్టం అనంతరం మంగళవారం సాయంత్రం జన్నవరం పెద్దేరు గట్టు వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె మృతదేహానికి కొరివి పెట్టాల్సివచ్చిందంటూ తండ్రి బోరుమన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Crime News
Crime News: క్రికెట్లో వాగ్వాదం.. బ్యాటుతో కొట్టి చంపిన బాలుడు
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?