logo

సమస్యలు పరిష్కరించమంటే నవ్వుతారా?

సమస్యలు తీర్చమంటే నవ్వే సమాధానమా అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును ఏఎస్‌పేట గ్రామస్థులు ప్రశ్నించారు. కోటవురట్ల మండలంలోని ఆక్సాహెబ్‌పేటలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

Published : 02 Jun 2023 03:28 IST

ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలు

ఎమ్మెల్యేకు సమస్యలను వివరిస్తున్న గ్రామస్థులు

కోటవురట్ల, న్యూస్‌టుడే: సమస్యలు తీర్చమంటే నవ్వే సమాధానమా అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును ఏఎస్‌పేట గ్రామస్థులు ప్రశ్నించారు. కోటవురట్ల మండలంలోని ఆక్సాహెబ్‌పేటలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే దృష్టికి పలువురు సమస్యలను వివరించారు. విద్యుత్తు సక్రమంగా ఉండకపోయినా బిల్లులు విపరీతంగా వస్తున్నాయని, ఇళ్లపై విద్యుత్తు తీగలను మార్చమంటే ఎవరూ పట్టించుకోవటం లేదని  ఫిర్యాదు చేశారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామంలో బోర్లు ఏర్పాటు చేయమని అధికారులను కోరినా ప్రయోజనం లేదన్నారు. ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తే నవ్వుతున్నారే తప్పా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, అర్హత ఉన్న   వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని యాసిడ్‌పాలెం గ్రామస్థులు కోరారు. దీంతో పంచాయతీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కల్వర్టు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నానని,  తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులకు, వైకాపా నాయకులకు చెప్పారు. ఎంపీడీఓ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ జానకమ్మ, వివిధ శాఖ అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. .

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు