logo

ప్రభుత్వ బడులకు మహర్దశ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.

Published : 02 Feb 2023 05:38 IST

మొగిలిచెర్ల ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

గీసుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుకొండ మండలం మొగిలిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 22.50 లక్షలు వెచ్చించి సదుపాయాలు కల్పించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి సారించిందన్నారు. పాఠశాలలో ఆంగ్లం చెప్పే ఉపాధ్యాయుడు గంట సేపు ఎక్కువ సమయం కేటాయించి విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పించాలన్నారు. డీఈవో వాసంతి,  అదనపు కలెక్టర్‌ కోట శ్రీవాత్సవ, మండల ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు పోలీసు ధర్మారావు, కార్పొరేటర్లు మనోహర్‌, మానస, శివ, డీసీసీబీ డైరెక్టర్‌ రమేష్‌, వరంగల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ చింతం సదానందం, ఎంఈవో సత్యనారాయణ ప్రధానోపాధ్యాయురాలు స్వరూప, విద్యాకమిటీ ఛైర్మన్‌ అశోక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు