logo

టెర్రరిస్టులపై సమరం కాదు..

రామప్ప పరిసరాల్లో ప్రత్యేక బలగాల సమరం ఏంటని అనుకుంటున్నారా? సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరబడినట్లే..  శత్రువులై సమరశంఖం పూరిస్తున్నట్లు కనిపిస్తున్న వీరు నిజమైన పోలీసులే.

Published : 17 Apr 2024 04:54 IST

సాధన చేస్తూ..

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: రామప్ప పరిసరాల్లో ప్రత్యేక బలగాల సమరం ఏంటని అనుకుంటున్నారా? సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరబడినట్లే..  శత్రువులై సమరశంఖం పూరిస్తున్నట్లు కనిపిస్తున్న వీరు నిజమైన పోలీసులే. మంగళవారం ఉదయాన్నే ఆక్టోపస్‌ ప్రత్యేక పోలీసు బృందం రామప్ప పరిసరాల్లోకి చేరుకున్నారు. ప్రాశస్థ్యం కలిగిన కట్టడాలపై శత్రువులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కట్టడాన్ని ఎలా రక్షించుకోవాలో సాధన చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రీహార్సల్స్‌ సమయంలో ఆలయానికి భక్తులు, పర్యాటకులను అనుమతించలేదు. ప్రత్యేక బలగాల వెంట స్థానిక పోలీసులు ఉన్నారు.

రామప్పలో ఆక్టోపస్‌ బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని