logo

ఓటరుకు ఆహ్వానం..

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ హనుమకొండ నగరంలోని నయీంనగర్‌లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు.

Updated : 18 Apr 2024 06:34 IST

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ హనుమకొండ నగరంలోని నయీంనగర్‌లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న సందర్భంగా ఓటరు ఆహ్వాన పత్రిక రూపొందించారు. వివాహ ఆహ్వాన పత్రిక మాదిరిగా పోలింగ్‌ సుముహూర్తం, వేదిక తదితర అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి కానుకలు ఇవ్వొద్దు, తీసుకోవద్దని ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు. అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని, మన భవిష్యత్తు రూపకర్తలైన ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ ఆశీస్సులు అందించాలని సత్యప్రకాశ్‌రావు ఓటర్లను కోరుతున్నారు. ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు, వాట్సప్‌ గ్రూపుల ద్వారా దాన్ని పోస్టు చేస్తూ పోలింగ్‌ శాతం పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.

న్యూస్‌టుడే, గోపాలపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని