logo

పోతన రచనలు జన రంజకం

బమ్మెర పోతన రచనలు జన రంజకమై చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయినట్లు తితిదే దత్సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో బుధవారం పోతన జయంతి వేడుకలను నిర్వహించారు.

Published : 18 Apr 2024 03:55 IST

కవి సమ్మేళనంలో పాల్గొన్న సాహితీవేత్తలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: బమ్మెర పోతన రచనలు జన రంజకమై చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయినట్లు తితిదే దత్సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో బుధవారం పోతన జయంతి వేడుకలను నిర్వహించారు. తొలుత సహజ పండితుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ధార్మిక ప్రాజెక్టుల విభాగం అధికారి రాజగోపాల్‌ మాట్లాడుతూ బమ్మెర పోతన హస్తాల నుంచి జాలువారిన రచనలు నవరసభరితమని వివరించారు. పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్‌ మాట్లాడుతూ సాహితీ రంగాన్ని యజ్ఞంలా చేశారని కొనియాడారు. నారాయణరెడ్డి, డాక్టరు నీలవేణి, డాక్టరు భూతపూరి గోపాలకృష్ణ శాస్త్రి, ఎం.శివారెడ్డి వివిధ అంశాలపై ఉపన్యసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు