logo

Telangana News: ఫొటోషూట్‌కని వచ్చి యువకుడి దుర్మరణం

ఫొటోషూట్‌ కోసం వచ్చిన ముగ్గురు యువకుల్లో ఒకరు అనుమానాస్పదంగా చెరువులో మునిగి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పహాడీషరీఫ్‌ ఎస్సై మధు కథనం ప్రకారం..

Updated : 30 Jan 2022 07:31 IST


నవీద్‌  

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: ఫొటోషూట్‌ కోసం వచ్చిన ముగ్గురు యువకుల్లో ఒకరు అనుమానాస్పదంగా చెరువులో మునిగి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పహాడీషరీఫ్‌ ఎస్సై మధు కథనం ప్రకారం.. నాంపల్లి ఆగాపురాకు చెందిన షేక్‌ అబ్దుల్‌ పాషా ట్రావెల్‌ వ్యాపారి. ఆయన చిన్న కుమారుడు షేక్‌ అబ్దుల్‌ నవీద్‌(23) డిగ్రీ విద్యార్థి. అతని మిత్రులు రవికాంత్‌(23), సిరాజ్‌లతో కలిసి ఫొటోషూట్‌ కోసం శుక్రవారం జల్‌పల్లి హుందాసాగర్‌కు చేరుకున్నారు. ఈత కొడదామని ముగ్గురూ చెరువులో దిగారు. నవీద్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడని అదేరోజు రాత్రి అతని కుటుంబసభ్యులకు రవికాంత్‌, సిరాజ్‌ సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి గాలించినా ఫలితం లేకపోవడంతో వారు పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం చెరువులో గజ ఈతగాళ్లతో గాలించి నవీద్‌ మృతదేహాన్ని వెలికితీశారు. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈతకు దిగాలన్నా హుందాసాగర్‌ పురాతన కట్ట పైనుంచి వీలు కాని పరిస్థితి. అతికష్టంగా నీటిలో దిగితే గుర్రపుడెక్కలో చిక్కుకుని మృతి చెందాడా.. మిత్రులు అఘాయిత్యానికి ఒడి గట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీద్‌ సోదరుడు అబ్దుల్‌ ఉమేర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని