logo

Cyber Crime: అత్యాశకు పోతే రూ.27 లక్షలు పాయే..

అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో సంప్రందించి.. భారీగా లాభాలిప్పిస్తానంటే నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. చివరకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదుచేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌వాసి

Updated : 17 May 2022 11:13 IST

నారాయణగూడ: అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో సంప్రందించి.. భారీగా లాభాలిప్పిస్తానంటే నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. చివరకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదుచేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌వాసి కరుణాకర్‌రెడ్డికి సామాజిక మాధ్యమంతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత అతను వాట్సాప్‌కాల్‌ చేసి పాతికేళ్ల మా కంపెనీ ట్రేడింగ్‌లో నంబర్‌ వన్‌ సంస్థగా ఉందంటే బాధితుడు నమ్మేశాడు. ‘బీటీసీ వెల్త్‌ ఫేర్‌009’ అనే వాట్సప్‌ గ్రూప్‌తో బాధితుడి నంబరును అనుసంధానం చేసేశాడా మోసగాడు. తొలుత బాధితుడు రూ.లక్ష పెట్టగా లాభాలిచ్చారు. మరో రూ.8లక్షలు పెట్టగా రూ.90 లక్షలు లాభంగా చూపాడు.20 శాతం కమీషన్‌గా రూ.18లక్షలు క్రిప్టోరూపంలో, మరో 30శాతం పన్ను.. అలా మొత్తం రూ.27 లక్షలు దోచేశాడా మోసగాడు. చివరకు అందుబాటులో లేకుండా పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు