logo

TSRTC: ఎంజీబీఎస్‌ ఆవరణలో ఉచిత ట్యాక్సీ.. ప్రయాణికుల హర్షం

తెలంగాణ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేస్తోంది.

Published : 11 Feb 2022 12:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల నగరంలోని ఎంజీబీఎస్‌ ఆవరణలో ఉచిత ట్యాక్సీ వసతిని ఏర్పాటు చేసింది. దీనికి ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌ లోపలి నుంచి బయటకు వచ్చేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. వృద్ధులు, మహిళలకు ఇది ఉపయుక్తంగా ఉంటోంది. ఈ సర్వీస్‌ చాలా బాగుందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని