ఫిక్కీకి రూ.20లక్షల జరిమానా

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)కి దిల్లీ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. ట్రాన్సన్‌ మార్గ్‌లోని భవనం కూల్చివేత ప్రదేశంలో ధూళి నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని............

Published : 10 Oct 2020 17:57 IST

దిల్లీ: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)కి దిల్లీ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. తాన్‌సేన్‌‌ మార్గ్‌లోని భవనం కూల్చివేత ప్రదేశంలో ధూళి నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ రూ.20లక్షల జరిమానా వేసింది. పర్యావరణ పరిహారాన్ని 15 రోజుల్లోపు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ప్రాజెక్టు సైట్‌ల వద్ద యాంటీ స్మాగ్‌ గన్‌ ఏర్పాటు చేయకుండా కూల్చివేత పనులు పునః ప్రారంభించడం గానీ, కొత్త నిర్మాణాలు చేపట్టడం గానీ చేయరాదని ప్రభుత్వం తెలిపింది.

దేశ రాజధాని నగరంలో 20వేల చదరపు మీటర్ల కంటే పెద్ద నిర్మాణాలు, కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశాల్లో యాంటీ స్మాగ్‌ గన్‌లు ఏర్పాటు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం దిల్లీలో ఇలాంటి ప్రదేశాలు 39 వరకు ఉన్నాయని, వీటిలో ఆరు ప్రదేశాల్లో యాంటీ- స్మాగ్‌ గన్‌లు ఏర్పాటు చేయకపోవడంతో పనులు నిలిపివేయాలని ఆదేశించినట్టు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ఫిక్కీ క్యాంపస్‌ వద్ద తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. పనులు నిలిపివేయాలని ఆదేశించామన్నారు. దుమ్ము, ధూళి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిన వారెవరైనా వదిలిపెట్టేది లేదని, కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని