
వరవరరావును ఆస్పత్రికి తరలించండి:హైకోర్టు
ముంబయి: భీమా కోరేగావ్ కేసులో అరెస్టయి ముంబయి జైలులో ఉన్న విరసం నేత వరవరరావును చికిత్స కోసం నానావతి ఆస్పత్రికి తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యుల అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం 15 రోజుల పాటు చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది. 81 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం మరింత విషమించిందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆయన్ను తక్షణమే నానావతి ఆస్పత్రికి తరలించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంది. ఆస్పత్రిలో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఆయన్ను కలిసేందుకు అనుమతించిన కోర్టు.. వారు ఆస్పత్రి నిబంధనలు పాటించాలని సూచించింది.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.