Corona: ఇన్‌ఫెక్షన్‌పై నిఘా పెట్టే రక్తపరీక్ష

వ్యక్తుల్లో కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తీరుతెన్నులను ప్రభావవంతంగా పర్యవేక్షించేందుకు దోహదపడగల

Updated : 15 Jul 2021 12:48 IST

మాడ్రిడ్‌: వ్యక్తుల్లో కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తీరుతెన్నులను ప్రభావవంతంగా పర్యవేక్షించేందుకు దోహదపడగల సరికొత్త రక్తపరీక్షను స్పెయిన్‌లోని యూఎంహెచ్‌-సీఎస్‌ఐసీ న్యూరోసైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఏసీఈ-2 అనే ప్రొటీన్‌ పరిమాణాన్ని నిర్ధారించడం ద్వారా ఇది పనిచేస్తుంది. సాధారణంగా ‘ఏసీఈ-2’ ద్వారా కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశిస్తుంది. ఈ ప్రొటీన్‌తో వైరస్‌ కలిసినప్పుడు ఏసీఈ-2 తునకలు (ఫ్రాగ్మెంట్లు) ఏర్పడతాయి. వ్యక్తుల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్లాస్మాలో పూర్తిస్థాయి పరిమాణంతో కూడిన ఏసీఈ-2 స్థాయులు తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సమయంలో వాటి ఫ్రాగ్మెంట్ల సంఖ్య పెరుగుతున్నట్లు నిర్ధారించారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ఈ రెండింటి స్థాయులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము అభివృద్ధి చేసిన రక్తపరీక్షతో ఏసీఈ-2, దాని తునకల పరిమాణాలను గుర్తించవచ్చునని.. రక్తంలో వాటి స్థాయులు కరోనా పరిణామ తీరుకు జీవ సూచికలుగా ఉపయోగపడతాయని వారు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని