ఐప్యాడ్‌తో సంగీతం.. యువకుడి ప్రతిభకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా

Anand Mahindra: సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఆనంద్ మహీంద్రా.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. 

Published : 16 Mar 2024 00:13 IST

Anand Mahindra | ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. నవతరం దీన్ని అందిపుచ్చుకోవడంలో ముందుంటోంది. సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. తాజాగా ఓ పోస్ట్ చేశారు. ఐప్యాడ్‌ సాయంతో సంగీత స్వరాల్ని పలికిస్తున్న ఓ యువకుడికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. అతడి సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు.

ఐప్యాడ్ మ్యుజీషియన్‌గా ప్రసిద్ధి చెందిన మహేష్ రాఘవన్‌కు సంబంధించిన వీడియోను మహీంద్రా ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ఆధునిక సాంకేతికతతో సంప్రదాయ మెలోడీని ప్లే చేస్తున్న ఆ వీడియో తననెంతో ఆకట్టుకుందన్నారు. ‘‘మహేష్ రాఘవన్ ప్రతిభను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఐప్యాడ్‌ సాయంతో అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. భారతీయులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటారు’’ అని మహీంద్రా రాసుకొచ్చారు. సంగీతకారుల బృందంలోని కళాకారులు ఐప్యాడ్‌నే వాయిద్యంగా మార్చి స్వరాల్ని పలికిస్తారో, లేదో చూడాలని పేర్కొన్నారు.

యువ జంటలకు సుధామూర్తి సలహా ఇదే..!

ఆనంద్‌ మహీంద్రా పంచుకున్న వీడియోపై మహేష్ రాఘవన్ స్పందించారు. తన వీడియోను షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేర్చుకోవడంపై మీకున్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది’’ అంటూ మహీంద్రా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది దీన్ని వీక్షించారు. రాఘవన్‌ టాలెంట్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అతడిని పొగొడ్తలతో ముంచెత్తుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు