Memes: రిషి సునాక్‌, ఆశిష్ నెహ్రా.. మీ ఇద్దరు సోదరులా అంటూ నెట్టింట మీమ్స్‌ వెల్లువ

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ భారత మాజీ పేసర్‌ ఆశిష్ నెహ్రాను పోలిఉంటడంతో ప్రస్తుతం నెట్టింట వీరికి సంబంధించిన మీమ్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. మీ ఇద్దరు సోదరులా అంటూ ప్రశ్నిస్తూ.. సరదా వ్యాఖ్యలు జోడిస్తున్నారు.

Published : 25 Oct 2022 02:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌(Rishi Sunak) ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆర్థిక మాంద్యం, ఆపై పరిస్థితుల నడుమ ప్రధాని లిజ్‌ ట్రస్‌(Liz truss) రాజీనామా చేయడంతో.. టోరీ సభ్యులు రిషి వైపే మొగ్గు చూపారు. దీంతో బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకోనున్న తొలి భారత సంతతి వ్యక్తిగానే కాకుండా, అతిపిన్న బ్రిటన్‌ ప్రధానిగానూ రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, భారత మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా.. రిషి సునాక్‌ను పోలి ఉంటడంతో మీ ఇద్దరు సోదరులా అంటూ నెట్టింట మీమ్స్‌ పుట్టుకొస్తున్నాయి. రిషి స్థానంలో నెహ్రా ఫొటోలను ఉంచి శుభాకాంక్షలు చెబుతూ నవ్వులు పంచుతున్నారు. కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలంటూ కోరుతున్నారు. ఈ సరదా మీమ్స్‌ను మీరూ చూసేయండి..











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని