Sadananda: కాంగ్రెస్‌లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం

తన భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని భాజపా సీనియర్ నేత సదానంద గౌడ(Sadananda) అన్నారు. 

Published : 18 Mar 2024 17:38 IST

బెంగళూరు: ప్రముఖ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ (Sadananda Gowda) భాజపా (BJP)ను వీడనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అలాగే ఆయన కాంగ్రెస్‌లో చేరొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ కేంద్ర మాజీ మంత్రి స్పందించారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణను మంగళవారం ఉదయం ప్రకటిస్తానని పేర్కొన్నారు. దాంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.

ఈరోజు సదానంద గౌడ పుట్టినరోజు. దాంతో ఆయన మద్దతుదారులు భారీ కార్యక్రమం నిర్వహించారు. దాని తర్వాత ఆయన భాజపాను వీడి, కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తనను కాంగ్రెస్ నేతలు సంప్రదించారని వెల్లడించారు. ‘నాతో ఇతరులు, మా పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. మంగళవారం నా మనసులో మాట చెప్తాను. కొన్ని చర్యలతో నేను ఎంతో బాధకు గురయ్యాను’ అని గౌడ అన్నారు. హస్తం పార్టీ ఆయనకు బెంగళూరు నార్త్‌తో పాటు మైసూర్‌-కొడగు స్థానాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని