GST: జీఎస్టీ పరిహారం కాల పరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి: కాంగ్రెస్ డిమాండ్
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడిందని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన ....
ఉదయ్‌పూర్: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడిందని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇందుకోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోన్న జీఎస్టీ పరిహారం కాల వ్యవధిని మరో మూడేళ్లు పెంచాలని డిమాండ్ చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ నవసంకల్ప్ చింతన్ శిబిరం వద్ద కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం- రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్రమైన సమీక్షకు సమయం ఆసన్నమైందన్నారు. 2017లో మోదీ సర్కార్ పేలవంగా రూపొందించిన జీఎస్టీ చట్టం అన్యాయంగా అమలు చేస్తుండటంతో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రతిఒక్కరూ చూస్తున్నారన్నారు.
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూలేనంతగా బలహీనపడటంతో తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య పూర్తిగా విశ్వాసం దెబ్బతిందన్న చిదంబరం.. ఈ ఏడాది జూన్ 30తో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు గడువు ముగియనుండటంతో కాల పరిమితిని మరో మూడేళ్లు పొడిగించాల్సిందేనన్నారు. ఒకవేళ దాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నిస్తే.. తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్‌కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్‌పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ తొలిసారిగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్‌పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్‌ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్‌ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్‌ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్‌సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్‌లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్‌సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్‌పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్‌లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్‌భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్‌లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్‌కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్‌కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్‌కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్‌తో అమెజాన్ 4K ఫైర్‌స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుంది: సత్యదేవ్