Fire accident: కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంటలు

కోల్‌కతా విమానాశ్రయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. చెక్‌ ఇన్‌ వద్ద సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అంతా భయాందోళనకు గురయ్యారు.

Published : 14 Jun 2023 22:33 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెక్‌ ఇన్‌ వద్ద సెక్యూరిటీ ఉండే ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అక్కడున్న  ప్రయాణికులను ఖాళీ చేయించారు.  అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. విమానాశ్రయం లోపల మంటలు చెలరేగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని