పాంగాంగ్‌ సరస్సుకు రాహుల్‌ బైక్‌ యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సుకు శనివారం ఆయన మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టారు.

Published : 20 Aug 2023 05:33 IST

లేహ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సుకు శనివారం ఆయన మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్‌ గాంధీ) చెప్పేవారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ యాత్రకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. రాత్రి ఆయన పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో బస చేస్తారని, ఆదివారం రాజీవ్‌ గాంధీ జయంతిని రాహుల్‌ ఈ సరస్సు వద్దే జరుపుకొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. గత గురువారం రాహుల్‌ లేహ్‌ పర్యటనకు వచ్చారు. సెప్టెంబరు 10న లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ - కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌... నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో రాహుల్‌.. లేహ్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని