ఆ పులిని చంపేయండి.. కేరళ ప్రభుత్వం ఆదేశాలు

వయనాడ్‌ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వయనాడ్‌కు చెందిన ప్రజీశ్‌ (36) శనివారం గడ్డి కోయడానికి వెళ్లగా పులి దాడి చేసి చంపేసింది.

Updated : 12 Dec 2023 08:29 IST

తిరువనంతపురం: వయనాడ్‌ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వయనాడ్‌కు చెందిన ప్రజీశ్‌ (36) శనివారం గడ్డి కోయడానికి వెళ్లగా పులి దాడి చేసి చంపేసింది. శరీరంలో కొంత భాగాన్ని తినేసింది. ఆ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి సృష్టించింది. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించొద్దంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అటవీ శాఖ ఆ పులిని అంతమొందించాలని ఆదేశాలు జారీచేసింది. ఆ పులి మనుషులను చంపి తినే రకమా? కాదా? అనేది ధ్రువీకరించుకోవాలని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని