వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్‌ సాల్వే

భారత్‌ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్‌ న్యాయవాది, మాజీ సోలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తప్పుపట్టారు. ప్

Published : 18 Mar 2024 05:46 IST

దిల్లీ: భారత్‌ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్‌ న్యాయవాది, మాజీ సోలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తప్పుపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ఆంగ్లవార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ‘‘పాకిస్థాన్‌లో వేధింపులకు గురయ్యే అహ్మదీయులు, మయన్మార్‌లోని రోహింగ్యాలు, దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న పాలస్తీనావాసులకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా..?’’ అని హరీశ్‌ ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని అగ్రరాజ్యం పునఃపరిశీలించుకోవాలని, అంతర్గత సమస్యలపై దృష్టిపెట్టాలని అమెరికాకు  సాల్వే హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని