సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు

భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది.

Published : 19 Mar 2024 03:40 IST

దిల్లీ: భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. దీనివల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధులు వంటి సాంక్రమికేతర రుగ్మతల ముప్పు పెరుగుతోందని వివరించింది. ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇండియా, చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) శాస్త్రవేత్తలు ఉత్తర భారతదేశంలో ఈ పరిశోధన చేశారు. ప్రధానంగా ఆహారంలో సోడియం, పొటాషియం, ఫాస్పరస్‌, ప్రొటీన్‌ వంటివి ఎంత మేర ఉంటున్నాయన్నది పరిశీలించారు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధుల బారినపడే ముప్పుపై అవి ప్రభావం చూపుతాయి. నిర్దేశిత ప్రమాణాల కన్నా ప్రొటీన్‌ను తక్కువగా తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని