ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్‌

నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లెక్కచేయలేదు.

Published : 19 Mar 2024 03:41 IST

దిల్లీ: నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లెక్కచేయలేదు. దిల్లీ జల్‌బోర్డులో అవకతవకలకు పాల్పడి సంపాదించిన అవినీతి సొమ్మును అక్రమంగా చలామణి చేశారని ఆయనపై ఈడీ ఆరోపణ. మద్యం విధానంలో మార్పులు చేయడం ద్వారా ఆర్జించిన అవినీతి సొమ్మును కూడా కేజ్రీవాల్‌ అక్రమంగా చలామణి చేశారని ఈడీ ఇప్పటికే అభియోగం మోపింది. ఈడీ పదేపదే నోటీసులు పంపుతోందనీ, ఆయనపై కోర్టులో కేసులు కూడా వేసిందనీ, అలాంటప్పుడు మళ్లీ నోటీసు జారీచేయడమేమిటని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దిల్లీ యూనిట్‌ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ ప్రశ్నించారు.

దిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ మంగళవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం స్వీకరించడానికి వీలుగా ఆయన్ను తిహాడ్‌ జైలు నుంచి విడుదల చేయాలని అధికారులను దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని