వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సోమవారం వెల్లడించారు.

Published : 19 Mar 2024 03:41 IST

ఎన్నికల బాండ్లపై కిరణ్‌ మజుందార్‌ షా

దిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సోమవారం వెల్లడించారు. తాను వ్యక్తిగత హోదాలో కొన్ని బాండ్లను కొనుగోలు చేసి మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ నేతృత్వంలోని జేడీ(ఎస్‌) సహా కొన్ని పార్టీలకు ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కిరణ్‌ మజుందార్‌ ప్రతినెలా రూ.5 కోట్ల విరాళమిచ్చారని ఇటీవల ‘ఎక్స్‌’లో ఒకరు పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె ‘మీ లెక్కలు తప్పు’ అని సమాధానమిచ్చారు. మరోసారి గణించాలని కోరారు. దీంతో ఆమె మొత్తం రూ.6 కోట్లు ఇచ్చినట్లు మరో యూజర్‌ తెలియజేశాడు. అయితే, ఇతర మాధ్యమాల ద్వారా ఏమైనా ఇచ్చి ఉంటే వెల్లడించాలన్నాడు. ‘‘నేనెప్పుడూ పారదర్శకంగా ఉంటా. మీరు చూస్తున్నది మాత్రమే నిజం’’ అంటూ పరోక్షంగా తాను రూ.6 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని