హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ రెబల్స్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట

కాంగ్రెస్‌ పార్టీ విప్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు.

Published : 19 Mar 2024 03:43 IST

ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిలిపివేతకు నిరాకరణ

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ విప్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. వారిని అనర్హులుగా ప్రకటిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై నిలుపుదల(స్టే) ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం నిరాకరించింది. అయితే, ఈ వ్యవహారంలో సభాపతి కుల్దీప్‌ సింగ్‌ పఠానియా కార్యాలయానికి నోటీసు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. తాము ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిందని పిటిషనర్లు తెలియజేయగా..ఆ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. అనర్హత వేటును నిలిపివేసేందుకు మాత్రం తిరస్కరించింది. అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనటానికి అనుమతించేది లేదని కూడా స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతతో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మే 7న ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని