సర్కార్‌ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Updated : 19 Mar 2024 07:13 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని లక్ష్మీపుర్‌ బ్లాక్‌లో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఘనంగా పెళ్లి చేసింది. అయితే ఆ రోజు ఓ యువతి పథకం ద్వారా వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడి తన సోదరుడితో ఏడడుగులు నడిచింది. ఆమెకు ఏడాది క్రితమే వివాహం జరగ్గా, ప్రస్తుతం భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. సమాచారం తెలిసిన అతడు అధికారులకు విషయాన్ని చేరవేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని