పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 19 Mar 2024 04:13 IST

ముజఫర్‌నగర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడిని వారణాసికి చెందిన ధర్మేంద్ర కుమార్‌గా గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ బోర్డు పరీక్ష పేపర్లతో పోలీసు బృందంతో కలిసి ప్రాంతీయ ఎస్‌డీ జూనియర్‌ కళాశాలకు వాహనంలో తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని ఎస్పీ సత్యనరైన్‌ తెలిపారు. ఆ వాహనంలో ధర్మేంద్రతో పాటు మరొక ఉపాధ్యాయుడు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. కళాశాల గేటు వద్ద వాహనం వేచి ఉన్న సమయంలో కుమార్‌కు హెడ్‌కానిస్టేబుల్‌ చందర్‌ ప్రకాశ్‌తో ఘర్షణ ఏర్పడిందని ఎస్పీ పేర్కొన్నారు. దీంతో ప్రకాశ్‌ తన సర్వీస్‌ తుపాకీతో కుమార్‌పై కాల్పులు జరిపాడని వెల్లడించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు ఎస్పీ తెలిపారు. హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం మత్తులో ఉన్న పోలీసు.. ధర్మేంద్రను పొగాకు అడగటంతో వారిద్దరి మధ్య వివాదం మొదలైందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.. కాల్పులకు తెగబడ్డ పోలీసుపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని బహిష్కరించి టీచర్లు ఆందోళన చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని