Ayodhya Ram Mandir: అంతరిక్షం నుంచి అయోధ్యను చూశారా?

Ayodhya Ram Mandir| అంతరిక్షం నుంచి అయోధ్య నగరం చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)క్లిక్‌ మనిపించింది.

Published : 22 Jan 2024 01:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం మరి కొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన (consecration ceremony at Ayodhya)మహోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అంతరిక్ష రంగంలో తనదైన ముద్రవేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మహత్తర వేడుకలో తాను కూడా భాగమైంది. అంతరిక్షం నుంచి అయోధ్య నగరం, రామమందిరం ఎలా కనిపిస్తున్నాయో ఫొటో తీసింది. దానిని ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్ (NRSC) విడుదల చేసింది. డిసెంబర్‌ 16న తీసిన ఈ చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కేవలం ఆయోధ్య రామమందిరమే కాకుండా దశరథ్‌ మందిర్‌, సరయు నదిని కూడా ఇందులో చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని