India-Myanmar: మయన్మార్‌ సరిహద్దు వద్ద కంచె వేస్తాం : అమిత్‌ షా ప్రకటన

India-Myanmar: మయన్మార్‌ నుంచి భారత్‌లోకి ఆ దేశీయుల రాకను నియంత్రించేందుకు సరిహద్దు వద్ద కంచె వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. 

Updated : 20 Jan 2024 16:47 IST

దిల్లీ: మయన్మార్‌(Myanmar)లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ సైనికులు పలువురు మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశించడం కలవరం సృష్టిస్తుంది. దీనిపై కేంద్రం స్పందించింది. దీన్ని అరికట్టేందుకు సరిహద్దు వద్ద కంచె వేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఇప్పటివరకు ఇరుదేశాల సరిహద్దుల్లోని ప్రజలు ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ముసుగులో వేలాదిమంది మయన్మార్‌ వాసులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. దీనికి ముగింపు పలుకుతామని ఆయన వెల్లడించారు.

మయన్మార్‌ నుంచి వందల్లో సైనికులు.. కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం

మయన్మార్‌లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీ జుంటాకు కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జుంటాకు, మూడు సాయుధ బృందాలకు మధ్య పోరు జరుగుతోంది. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మనదేశంలోకి ప్రవేశించారు. రెబల్‌ బృందాలు పైచేయి సాధిస్తుండటంతో పాటు తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో సైనికులు మిజోరంలోని లాంగ్‌ట్లాయ్‌ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారంపై మిజోరం ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వారిని తిరిగివెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ఈ ప్రకటన వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని