Jagdeep Singh: ఏడడుగుల.. ఆ ‘ఎత్తైన’ మాజీ పోలీస్‌ అరెస్ట్‌!

ప్రపంచంలోనే ఎత్తైన పోలీస్‌గా పేరొందిన మాజీ కానిస్టేబుల్‌ను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల కేసులో ఆయనతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Published : 15 Dec 2023 21:37 IST

చండీగఢ్‌: పంజాబ్‌కు చెందిన జగ్‌దీప్‌ సింగ్‌ (Jagdeep Singh) అనే మాజీ కానిస్టేబుల్‌ ప్రపంచంలోనే ఎత్తైన పోలీస్‌గా పేరొందిన విషయం తెలిసిందే. ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆయన.. అమెరికా రియాలిటీ షోలోనూ పలుమార్లు పాల్గొని సంచలనంగా నిలిచాడు. తాజాగా ఆయన మాదకద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. తరన్‌ తారన్‌ జిల్లాలో జగ్‌దీప్‌ నడుపుతున్న ఓ ఎస్‌యూవీ కారును స్టేట్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ సెల్‌ పోలీసులు (Punjab Police) తనిఖీ చేయగా అందులో 500 గ్రాముల హెరాయిన్‌ లభ్యమైంది. సింగ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Parliament: ‘ప్లాన్‌-బి’ రచించి.. ఆధారాలను తగలబెట్టి..!

పంజాబ్‌కు చెందిన జగ్‌దీప్‌ సింగ్‌ (Jagdeep Singh) ఎత్తు ఏడు అడుగుల ఆరు అంగుళాలు. స్థానికంగా దీప్‌ సింగ్‌గా ప్రసిద్ధి. సిక్కు వర్గంలో ఆయనే ఎత్తైన వ్యక్తి. ప్రపంచంలోనే ఎత్తైన పోలీస్‌గానూ నిలిచాడు. అమెరికా రియాలిటీ టీవీ షో (America's Got Talent)లోనూ అనేకసార్లు కనిపించాడు. ఓ గ్రూపు తరఫున అందులో పాల్గొన్న సింగ్‌.. ప్రమాదకరమైన స్టంట్లు వేసి ఆశ్చర్యపరిచేవాడు. అయితే, ఇటీవల ఉద్యోగం మానేసిన ఆయన.. తన వాహనంపై పోలీస్‌ స్టిక్కర్‌ వేసుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని